EC : 86.17% మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఈసీ

EC : 86.17% మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఈసీ
X

జాతీయ పార్టీలకు చెందిన 7,193 మంది అభ్యర్థులు (86.17%) లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాలో బీఎస్‌పీ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ 488 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా 97.5% మంది డిపాజిట్ కోల్పోయారు. ఆ తర్వాత స్థానాల్లో సీపీఐ(ఎం)- 57.69%, ఎన్‌పీపీ- 33.33%, TMC- 10.41%, కాంగ్రెస్- 7.9%, బీజేపీ- 6.12% ఉన్నాయి.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే 74 మంది విజేతలుగా నిలిచారు. గరిష్ఠంగా బెంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అప్పుడు 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. దీంతో 18వ లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిథ్యం 13.62శాతంగా ఉండనుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో 25ఏళ్ల వయసున్న నలుగురు అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి సత్తాచాటారు. బిహార్‌లోని సమస్తిపుర్‌‌‌లో శాంభవీ (LJP) 1.87లక్షల మెజార్టీతో గెలుపొందారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నుంచి పోటీకి దిగిన సంజనా జాతవ్ (కాంగ్రెస్) 51వేల మెజార్టీతో గెలిచారు. ఇక యూపీలోని కౌశాంబి నుంచి పుష్‌పేంద్ర సరోజ్ (SP) లక్ష మెజార్టీతో గెలుపొందారు. మచలీషెహర్‌లో ప్రియా సరోజ్ (SP) 35వేల మెజార్టీతో గెలిచారు.

Tags

Next Story