Uttar Pradesh : కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

X
By - Manikanta |30 March 2024 2:20 PM IST
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బులంద్‌షహర్‌లో మార్చి 29న అర్థరాత్రి గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన యొక్క రెండు బీములు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తుఫాను కారణంగా బీమ్‌లు కూలిపోయాయని జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) సీపీ సింగ్ తెలిపారు.
బులంద్‌షహర్‌లోని గజ్రౌలా గ్రామం నుంచి అమ్రోహాలోని విరంపూర్ గ్రామం వరకు రూ.83 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) మరియు సేతు నిగమ్ పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది. వంతెన కోసం తక్కువ నాణ్యత గల నిర్మాణ సామగ్రిని ఉపయోగించడంపై వచ్చిన ఆరోపణలను డీఎం తోసిపుచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com