Fish Incident : ఈతకు వెళితే.. గొంతులో చేప ఇరుక్కుపోయింది

Fish Incident : ఈతకు వెళితే.. గొంతులో చేప ఇరుక్కుపోయింది

స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్ చాంపా జిల్లాలో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్(14) ఉక్కిరిబిక్కిరయ్యాడు. సతమతం అవుతున్న బాలుడి నోటిలో నుంచి చేపను బయటకుతీసేందుకు విఫలయత్నం చేసిన స్థానికులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సగం చేపను మాత్రమే బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆస్పత్రికి తరలించారు.ముందస్తు సమాచారంతో సిద్ధంగా ఉన్న అక్కడి వైద్యులు సమీర్‌ మెడ దగ్గర చిన్న రంధ్రం చేసి మిగతా చేపను విజయవంతంగా బయటకు తీశారు. బాలుణ్ని పరిశీలనలో ఉంచినట్లు డాక్టర్‌ రామకృష్ణ కశ్యప్‌ తెలిపారు.

Tags

Next Story