Aadhaar : ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

ఆధార్ కార్డును ( Aadhaar Card ) ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2024 జూన్ 14తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్ 14 వరకు పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి.
ఆన్‌లైన్‌లో ఆధార్ ఉచిత అప్‌డేట్ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అందులోని వివరాలన్నీ సరైనవో కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
14 అంకెల ‘అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com