AAP Star Campaigner : ఆప్ స్టార్ క్యాంపెనర్‌గా కేజ్రీవాల్ సతీమణి

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉండటంతో ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆయన సతీమణి సునీత అందుకోనున్నారు. స్టార్ క్యాంపెనర్ల లిస్ట్‌లో సునీతకు పార్టీ తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో మే 7న జరిగే లోక్‌సభ ఎన్నికలకు సునీత ప్రచారం చేయనున్నారు. పొత్తులో భాగంగా భావ్‌నగర్, భారుచ్ స్థానాల్లో ఆప్.. మిగతా 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి.
జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ సందేశాన్ని పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’ అని పేర్కొన్నట్లు చెప్పారు. కేజ్రీవాల్‌ను తక్కువ చేసి చూపేందుకు 24 గంటలూ ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు. ‘కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారు. ఏ ఒక్కరినీ దగ్గరగా కలిసేందుకు ఆయనను అనుమతించట్లేదు. ఇవి ప్రతీకార రాజకీయాలే’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com