Kalyan Jewellers : కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో పేలిన ఏసీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Kalyan Jewellers : కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో పేలిన ఏసీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

కళ్యాణ్ జ్యువెలర్స్‌ షోరూమ్ లో ఏసీ పేలిపోయింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కర్ణాటక బళ్లారిలోని స్టోర్ లో జరిగింది. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది, స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మండే ఎండల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. బాగా ఎండ ఉన్నప్పుడు ఆరుబయట పార్క్ చేసిన వాహనాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. హీట్ ఎక్కువైతే ఏదైనా ప్రమాదమేనని చెబుతున్నారు.

కర్ణాటక బళ్లారిలోని కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ స్టోర్‌లో ఉన్నట్లుండి ఎయిర్ కండీషనర్‌ పేలిపోయింది. కొంత మేర మంటలు వ్యాపించాయి. షోరూం మొత్తం పూర్తిగా పొగను అలుముకుంది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గురువారం సాయంత్రం ఈ పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు.

Tags

Next Story