Air India : ఎయిర్ ఇండియా ఉద్యోగుల వేతనాలు పెంపు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తమ ఉద్యోగులకు జీతాలు పెంచింది. దీంతో పాటు పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా CHRO రవీంద్రకుమార్ వెల్లడించారు. ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఎయిర్ ఇండియాలో ప్రస్తుతం 18వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఎయిరిండియాలో ప్రస్తుతం 18 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎయిరిండియా గ్రూప్‌లో ప్రస్తుతం నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిర్‌ఏషియా ఇండియా); ఎయిరిండియాలో విస్తారా విలీనం కానున్నాయి. 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను దక్కించుకున్న టాటా గ్రూప్.. కాంట్రాక్ట్‌ల పునరుద్ధరణ, పరిహారం చెల్లింపు వంటివి మాత్రమే చేపట్టింది. దాదాపు రెండేళ్ల తర్వాత వేతన పెంపు చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com