PAN with Aadhaar Link : అలెర్ట్.. పాన్ ఆధార్ లింక్ కు నేడే లాస్ట్
పాన్, ఆధార్ లింక్ గడువు నేటితో ముగియనుంది. అనుసంధానం చేయనివారు మార్చి 31, 2024కు ముందు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఎక్కువ TDS చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించింది. రూ.1,000 అపరాధ రుసుముతో మే 31, 2024లోపు లింక్ పూర్తి చేయాలని, ఆ లోపు పాన్ యాక్టివేట్ చేసిన వారికి ఎలాంటి అదనపు భారం ఉండదని పేర్కొంది. https://eportal.incometax.gov.in/ సైట్ ద్వారా పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు.
ఆధార్‌తో పాన్ అనుసంధానం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కంట్యాక్స్ పోర్టల్‌లో ‘లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేయడం ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుంది. అనుసంధానమైతే లింక్ అయినట్లు మెసేజ్ వస్తుంది. లేకపోతే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి లింక్ పూర్తి చేసుకోవచ్చు. రుసుము చెల్లించిన తర్వాత 4-5 రోజుల తర్వాతే ఆధార్-పాన్‌ను అనుసంధానం చేసుకునేందుకు వీలవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com