Congress : అమెథీ బరిలో సోనియా గాంధీ అల్లుడు?

Congress : అమెథీ బరిలో సోనియా గాంధీ అల్లుడు?

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన అమేరీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురు వారం పరోక్ష సంకేతాలిచ్చారు. అమేధీలో సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ పట్ల స్థానిక ప్రజలు విసిగిపోయి ఉన్నారని, గాంధీ కుటుం బానికి చెందిన వారిని ఇక్కడి నుంచి పోటీచేయాలని అమేథీ ప్రజలు కోరుతున్నారని వాద్రా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆయన అమేథీ నుంచి పోటీ చేయడం ఖాయమని జాతీయ మీడియా కథనాలు ప్రసారంచేసింది. రాయ్ బరేలీ లేదా అమేడికి ప్రాతినిధ్యం వ హించేవారు ఎవరైనా ప్రజల అభివృద్ధి, వారి భద్రతకు పనిచేయాలే తప్ప, వివక్షరాజకీయాలు చేయకూడదని వాద్రా అభిప్రాయపడ్డారు. ఆమె(స్మృతి ఇరానీ) నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండిపోయారు, ఈ ప్రాంతం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.

గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయడం, వారిని కించపరచడం, తన అధికారాన్ని దుర్వినియోగం చేయడంపైనే ఆమె వహించారు అని వాద్రా ఆరోపించారు. గాంధీ కుటుంబం అమేథీ, రాయ్ బరేలీ, సుల్తాన్పూర్, జగదీష్ పూర్ ప్రజల కోసం ఏళ్ల తరబడి కష్టపడిందని వాద్రా గుర్తుచేశారు.

ఒకవేళ తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలని అనుకుంటే, తప్పకుండా అమేడికి ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజలు తనతో బాగా అనుబంధం కలిగి వున్నారని. తరచూ కలుస్తుంటారని వాడ్రా తెలిపారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాద్రా రాజకీయ ప్రవేశం గురించి. 2022లోనూ ప్రస్తావన వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story