EVM Hacking With OTP : ఓటీపీతో ఈవీఎం ఓపెన్.. తోసిపుచ్చిన ఎలక్షన్ కమిషన్
ఎలక్ట్రాన్రిక్ ఓటింగ్ మెషిన్ హ్యాకింగ్ ( EVM Hacking ) పై వచ్చిన ఆరోపణలను సీనియర్ ఎన్నికల అధికారి వందనా సూర్యవంశీ ( Suryavamsi ) ఖండించారు. మన దేశంలో వాడుతున్న ఈవీఎంలు కమ్యూనికేషన్ కోసం ఎటువంటి సదుపాయం లేని ఫూల్ ప్రూఫ్ స్వతంత్ర పరికరం అని తెలిపారు. ఆదివారం ఆమె ముంబయిలో మాట్లాడిన ఆయన.. ఈవీఎం తెరిచేందుకు మొబైల్ ఫోన్, ఓటీపీ అవసరం లేదన్నారు. ముంబయి నార్త్ వెస్ట్ కౌంటింగ్ కేంద్రంలో గెలిచిన అభ్యర్థి బంధువు మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తప్పుడు వార్త వ్యాప్తి చేసి పరువు నష్టం కలిగించిన ముంబయికి చెందిన ఓ వార్తాపత్రికకు ఎన్నికల సంఘం ( Election Commission ) నోటీసు జారీ చేసిందని ఆమె వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంను అన్ లాక్ చేయడానికి వన్ టైం పాస్ వర్డ్ కోసం శివసేన ఎంపీ అభ్యర్థి బావమరిది మంగేష్ పండిల్కర్ ఫోన్ ను వాడినట్లుగా స్వతంత్ర అభ్యర్థి గుర్తించి ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తేవడంతో ఆయనపై పోలింగ్ అధికారి దినేష్ గురవ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆయనకు మొబైల్ ఫోన్ ఇచ్చినందుకు ఈసీ ఉద్యోగిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గోరే గావ్ ప్రాంత పోలీసులు మంగేష్ పండిల్కర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబయి నార్త్ వెస్ట్ లో శివసేన అభ్యర్థి 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో ఈవీఎం ట్యాంపరింగ్ అనుమానాలు మరింత బలపడ్డాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com