Amit Shah : 2029 తర్వాత కూడా మోడీనే ప్రధాని.. అమిత్ షా హాట్ కామెంట్స్

Amit Shah : 2029 తర్వాత కూడా మోడీనే ప్రధాని.. అమిత్ షా హాట్ కామెంట్స్
X

లోక్ సభ ఎన్నికల్లో ఒక వేళ బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీని కొద్దిరోజులకే దించేస్తారని.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. బీజేపీ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల వయస్సు నిండిన వారికి పార్టీలో ఎలాంటి పదవులు ఉండవు.

2027తో మోడీకి 75 ఏళ్లు నిండుతాయి. బీజేపీ అధికారంలో వస్తే మోడీ స్థానంలో మరో వ్యక్తి ప్రధాని అవుతారని అరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన అమిత్ షా 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మోడీని తమ ప్రధానిగా ఎన్నుకుంటున్నారు.

జూన్ 4 ఫలితాల తర్వాత ఆయనే ప్రధాని అవుతారనీ.. 2029 వరకు మోడీ నే భారత ప్రధానిగా కొనసాగుతారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయనే మా ప్రధాని అభ్యర్థిగా ఉంటాడని అమిత్ షా స్పష్టం చేశారు.

Tags

Next Story