Amit Shah : పౌరసత్వ సవరణ చట్టంపై అమిత్ షా క్లారిటీ

Amit Shah : పౌరసత్వ సవరణ చట్టంపై అమిత్ షా క్లారిటీ

పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రతిపక్షాలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. సీఏఏ (CAA) అమలు చేస్తామని 2019 నుంచి చెబుతున్నానని అన్నారు. CAA అనేది ఎవరి పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదని, పౌరసత్వం ఇవ్వాలని మైనారిటీ వర్గానికి మరోసారి హామీ ఇచ్చారు. అఖండ భారతదేశంలో భాగమైన వారందరికీ పౌరసత్వం ఇస్తామని చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని, ఓటు బ్యాంకు కోసమే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు ఏం చెప్పినా నెరవేర్చని చరిత్ర ఉందని అమిత్ షా అన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేదా బీజేపీ ఏది మాట్లాడినా నేరవెరుతుందన్నారు.

అంతేకాకుండా పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. CAAను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడబోదని అన్నారు. దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించడం సార్వభౌమ హక్కు అని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేనప్పుడు CAAను ఎలా రద్దు చేస్తారని సెటైర్ వేశారు. ఇంటర్వ్యూలో CAA సమయం గురించి అడిగినప్పుడు.. ‘ఒవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల రాజకీయాలు చేస్తున్నాయి. సమయపాలన ప్రశ్నే లేదు. 2019లో బీజేపీ మేనిఫెస్టోలో సీఏఏ తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని చెప్పినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story