Amit Shah : కేజ్రీవాల్‌ అంటేనే లిక్కర్ స్కాం.. అమిత్ షా సెటైర్

Amit Shah : కేజ్రీవాల్‌ అంటేనే లిక్కర్ స్కాం.. అమిత్ షా సెటైర్
X

ఎన్నికల ప్రచారంలో బీజేపీ వాడి పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను ఎన్నికల ప్రచారంలో చూసినప్పుడు ప్రజలకు మద్యం కుంభకోణం గుర్తుకు వస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కేజ్రీవాల్‌ ఢిల్లీ, పంజాబ్‌తో సహా ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు ఆయనను చూసినప్పుడు వారికి ముందుగా పెద్ద మద్యం సీసాలు కనిపిస్తాయని అమిత్‌షా చెప్పారు.

కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఆప్, కేజ్రీవాల్‌ గొప్ప విజయంగా భావించవద్దన్నారు అమిత్ షా. ఆప్‌కి ఓటు వేస్తే మళ్లీ జైలుకు వెళ్లకుండా చూస్తామని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని పంపిస్తాయని అమిత్‌షా అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గెలుపు ఓటములను బట్టి నేరాన్ని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోదని.. ఇది సుప్రీంకోర్టు పనితీరుపై తప్పుడు వ్యాఖ్య అవుతుందని షా తెలిపారు.

ప్రచారం చేయడానికి కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని అమిత్ షా అన్నారు. ఢిల్లీలోని ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు సూచించింది.

Tags

Next Story