Bridge Collapse : బిహార్‌లో కుప్పకూలిన మరో బ్రిడ్జి

X
By - Manikanta |28 Jun 2024 2:20 PM IST
బిహార్‌లో బ్రిడ్జిలు వరసగా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 3చోట్ల వారధులు కూలగా కిషన్‌గంజ్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. మదియా నదిపై 2011లో కట్టిన బ్రిడ్జి వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని అరారియా జిల్లాలో 2, సివార్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారధుల నాణ్యతపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. కిషన్‌గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో బహదూర్ గంజ్ - దిఘాల్ బ్యాంక్ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గత పది రోజుల్లోనే ఇలాంటి ఘటన ఇది నాలుగోది కావడం గమనార్హం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com