AAP : మరో నాలుగు ఆప్ వికెట్లు డౌన్

లిక్కర్ కేసులో ఆప్ వికెట్ల పతనం ఇప్పట్లో ఆగేలా లేదు. దీంతో ఆప్ లో గుబులు మొదలైంది. ఢిల్లీలో ఆప్ మంత్రి ఆతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు నెలల్లో, లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు.
తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు వెల్లడించారు ఆతిషి. కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల తమకు భయం లేదని, ఎంత మందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగదు అని పేర్కొన్నారు. తాము కేజ్రీవాల్ సైనికులమని ఆమె అన్నారు.
తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఆప్ కార్యకర్తలను బీజేపీ జైల్లో వేసినా, ప్రతి కార్యకర్త మళ్లీ పోరాటం చేస్తూనే ఉంటారన్నారు ఆతిషి. ఒక్కర్ని జైల్లో వేస్తే పది మంది పోరాడేందుకు పుట్టుకు వస్తారని ఆమె అన్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే తనను అరెస్టు చేయబోరని ఓ నేత చెప్పినట్లు మంత్రి ఆతిషి వెల్లడించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. ఈనెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. తిహార్ జైలుకు కేజ్రీవాల్ ను తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com