NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో మరో పది మంది అరెస్ట్

NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో మరో పది మంది అరెస్ట్
X

నీట్-యూజీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి హజారీబాగ్ లో సీబీఐ పది మందిని అరెస్ట్ చేసింది. ఈ పది మందిలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్తో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఐదుగురుఇన్విజి లేటర్లు, ఇద్దరు పరిశీలకులు, ఒక సెంటర్ సూపరింటిండెంట్, ఒక ఇ-రిక్షా డ్రైవర్ ఉన్నారు.

వీరంతా నీట్ పరీక్ష నిర్వహించిన పాఠశాలకు చెందినవారే. వారందరినీ కస్టడీలోకి తీసుకున్న సీబీఐ బృందం చర్చి గట్టి హౌన్లో విచారిస్తోంది. ప్రశ్నాపత్రాల పంపిణీ సమయం, డిజిటల్ లాడ్, పేపర్ల పంపిణీ ఎలా జరిగింది, పేపర్ల ప్యాకింగ్, ట్రంకు పెట్టెలో ట్యాంపరింగ్ వంటి అంశాలకు సంబం ధించి ప్రశ్నలు అడుగుతోంది.

ప్రిన్సిపాల్ ఎహసాన్ ఉల్ హక్కు చెందిన రెండు ఫోన్లు, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలమ్కు చెందిన ఒక ఫోను సీబీఐ స్వాధీనం చేసుకుంది. కేసును సాంకేతిక కోణంలో దర్యాప్తు జరుపుతోంది. ఓఎఎల్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుంది. గత మూడు నెలలుగా ప్రిన్సిపాల్ కాల్ వివరాలను కూడా దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. యూజీసీ నెట్ పరీక్ష కూడా ఈ కేంద్రంలోనే జరిగిందని ప్రిన్సిపాల్ తో సహా పాఠశాల సిబ్బంది వాంగ్మూలాలను బట్టి సీబీఐ బృందం గుర్తించింది.

Tags

Next Story