Precautions For Chicken : చికెన్, ఎగ్ తింటున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి

చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకం దారులకు, చికెన్ వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులు కోళ్ల పెంపకం.. మాంసం వినియోగం పట్ల జాగ్రత్తలు పాటించాలని ప్రజలను హెచ్చరించింది. ఏపీతోపాటు పలు రాష్ట్రా ల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ముందస్తుగా జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలంగాణ పశు సంవర్ధక, మత్స్యశాఖ విభాగం తెలిపింది. కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా వైరస్ కారణమని నిర్ధారించారు. కోళ్లు, ఇతర జంతువులలో సంభ వించే అనుమానస్పద, వైరస్ మరణాల వివరాల పట్ల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com