Army Chief : ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. ఆయన పదవీ కాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. జనరల్ మనోజ్ పాండే జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్ గా కొనసాగ నున్నారు.
వాస్తవానికి ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం పదవీకాలాన్ని కొనసాగించింది. ఆయన ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎయిఎం నరవణే స్థానంలో ఆర్మీ చీఫ్ నియామకమయ్యారు.
ఇప్పటి వరకు, ఎక్కువగా పదాతిదళం, ఆర్మ్‌డ్ అండ్ ఆర్టిలరీ అధికారులు ఆర్మీ చీఫ్ లుగా పని చేశారు. పాండే తూర్పు ఆర్మీ కమాండర్ గా కూడా పని చేశారు. లెఫ్టినెంట్ జనరల్ పాండే తూర్పు కమాండ్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్ గా సేవలు అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com