Delhi CM : కేజ్రీవాల్‌‌ను ప్రశ్నించేందుకు ఈడీ రెడీ.. 10 రోజుల కస్టడీ కోరే చాన్స్

Delhi CM : కేజ్రీవాల్‌‌ను ప్రశ్నించేందుకు ఈడీ రెడీ.. 10 రోజుల కస్టడీ కోరే చాన్స్

లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు రాజకీయ పెను సంచలనం నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరెస్ట్ కు ముందు కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన్ని పలు ప్రశ్నలు వేసి ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

కేజ్రీవాల్ ను నేరుగా ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. రాత్రంతా సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు లాకప్‌లో ఉంచారని తెలుస్తోంది. కేజ్రీవాల్ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదనీ.. తెల్లవారుజామునే అల్పాహారం, మందులు తీసుకున్నారని పలువురు అధికారులు చెప్పారు. ఇక ఉదయమే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు చేయించారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లిక్కర్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఖండించారు. కేజ్రీవాల్‌ను మాత్రమే అరెస్ట్‌ చేస్తారు కానీ.. ఆయన ఆలోచనను బంధించలేరని అన్నారు. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదనీ.. ఆలోచనా విధానమని అన్నారు. మరోవైపు లిక్కర్‌ స్కాం కేసులోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్‌, కవితను కలిపి విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story