Ashoka Gajapathi Raju : గోవా గవర్నర్ గా అశోక గజపతి రాజు...మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ను గోవా గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది.
కాగా విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. గతంలో ఆయనకు కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. పదవి ఏదైనా అంకితభావం తో పనిచేస్తూ, వివాదాలకు దూరం గా ఉంటారు అశోకగజపతి రాజు. సుదీర్ఘ కాలంగా టీడీపీ లో ఉన్న ఆయనకు చంద్రబాబు నాయుడు తో మంచి సాన్నిహిత్యం ఉంది.ఆయనను గోవా గవర్నర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అవ్వడంతో టీడీపీ పార్టీ వర్గాల తో పాటు , ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఇక హర్యానా గవర్నర్‌గా ప్రస్తుతం తెలంగాణ కు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఆయన స్థానం లో కొత్త గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్‌ను నియమించారు. ఆషింకుమార్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com