నేను జీవించి ఉన్నంత వరకు వాటికి అనుమతించను : అస్సాం సీఎం

నేను జీవించి ఉన్నంత వరకు వాటికి అనుమతించను : అస్సాం సీఎం

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తాను జీవించి ఉన్నంత వరకు రాష్ట్రంలో బాల్య వివాహాలను అనుమతించబోనని తేల్చిచెప్పారు. అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం, 1935ను రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 2026లోపు రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలిస్తానని అస్సాం సీఎం హామీ ఇచ్చారు.‘నేను రాజకీయంగా మిమ్మల్ని సవాలు చేయాలనుకుంటున్నాను. 2026లోపు దీన్ని రద్దు చేస్తాను' అని అన్నారు.

"నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను బతికి ఉన్నంత వరకు, అస్సాంలో బాల్య వివాహాలు జరగనివ్వను. హిమంత బిస్వా శర్మ జీవించి ఉన్నంత వరకు నేను అలా జరగనివ్వడు.. నేను మీకు రాజకీయంగా సవాలు చేయాలనుకుంటున్నాను. నేను చేస్తాను. 2026లోపు దీన్ని ఆపేయండి" అని ఆయన అన్నారు.

వధూవరుల చట్టబద్ధమైన వయస్సు 18 - 21 ఏళ్లకు చేరుకోకపోయినా వివాహాల నమోదును అనుమతించే నిబంధనలు ఉన్నందున బాల్య వివాహాల సామాజిక విపత్తును అంతం చేసే ప్రయత్నంలో ఈ చట్టాన్ని రద్దు చేసే నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని పాలక బీజీపీ స్వాగతించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ చర్యను 'ముస్లింలపై వివక్ష' అని పేర్కొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story