Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఆస్తుల చిట్టా ఇదే..

Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఆస్తుల చిట్టా ఇదే..

కాంగ్రెస్ అగ్రనేత, ప్రిన్స్ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామినేషన్ పత్రాలలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.20.25 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో రూ.9.25 కోట్లు విలువైన చరాస్తులు, రూ.11 కోట్లు విలువైన స్థిరాస్తి ఉన్నాయని తెలిపారు.

తన స్థిరాస్తుల్లో వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు ఉన్నాయని నామినేషన్ పత్రాల్లో ప్రస్తావించారు. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల విలువ రూ.14 కోట్లు అని తెలిపారు. ఆ ఆస్తులు పెరిగి రూ.20 కోట్లు దాటాయి. రాహుల్ ఆస్తులు దాదాపు 28 శాతం మేర పెరిగాయన్న మాట. రాహుల్ పై 18 పెండింగ్ కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పరువు నష్టం దావా కేసులే ఉన్నాయి.

రాహుల్ పేరిట రెండు కార్యాలయ స్థలాలు (B-007, B-008) హరియాణాలోని గురుగ్రామ్‌ పరిధి సిలోఖేరా గ్రామంలో ఉన్న సిగ్నేచర్ టవర్స్‌లో ఉన్నాయి. వీటిని రూ.7 కోట్ల రూ. 93 లక్షల ధరతో కొనగా, ప్రస్తుతం ఈ స్థలాల మొత్తం ధర రూ.9 కోట్ల వరకు పెరిగింది. తనకు ఎంపీగా వేతనం, అద్దెలు, బ్యాంకు వడ్డీ, బాండ్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు నుంచి ఆదాయం వచ్చినట్టు రాహుల్ గాంధీ తెలిపారు. తన చేతిలో రూ. 55 వేల నగదు ఉందని రాహుల్ తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో రూ. 26,25,157 డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. తనకు రూ.3,81,33,572 మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, రూ. 1,52,147 విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లు, రూ. 4,33,60,519 విలువైన ఈక్విటీ షేర్లు తన పేరిట ఉన్నాయని రాహుల్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story