Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్.. రూ. 10 లక్షలకు పెంపు

Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్..  రూ. 10 లక్షలకు పెంపు
X

జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా కేంద్రం అమలు చేస్తోన్న ‘ఆయుష్మాన్ భారత్’ ( Ayushman Bharat ) పరిమితిని ₹10లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లబ్ధిదారుల సంఖ్యనూ రెండింతలు చేసేందుకు యోచిస్తోందట. రాబోయే బడ్జెట్లో ఈ పథకంపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం దీని కింద అర్హులకు ₹5లక్షలు అందుతోంది. ఒకవేళ పెంచితే ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ.12వేల కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మొదట 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. జూన్ 27న జరిగిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ పథకంలో మరో 4-5 కోట్ల మంది చేరుతారని అంచనా. అలాగే బీమా హామీ మొత్తాన్నికూడా పెంచే ఆలోచనలో ఉన్నట్టు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఖజానాపై ఏటా 12 వేల 76 కోట్ల అదనపు భారం పడనున్నది. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే దేశంలో మూడింట రెండొంతుల మంది ఆరోగ్య బీమా పరిధిలోకి రానున్నారు.

Tags

Next Story