Lok Sabha Elections : ఆజాద్ యూటర్న్.. లోక్‌సభ ఎన్నికలకు దూరం

తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జమ్మూకశ్మీర్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) చీఫ్ గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. ఆయన అనంతనాగ్- రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఈ నెల 2న పార్టీ తెలిపింది. అయితే అనూహ్యంగా ఆజాద్ యూటర్న్ తీసుకుని పోటీ చేయడం లేదని తాజాగా ప్రకటించారు. ఇక్కడ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై గులామ్ నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని రాహుల్ దీటుగా ఎదుర్కొంటున్నారన్న కాంగ్రెస్ శ్రేణుల వాదనను తోసిపుచ్చారు. ‘రాహుల్ చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు ఎందుకు సంకోచిస్తున్నారు? ఆ రాష్ట్రాల నుంచి పరారై మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు’ అని ప్రశ్నించారు.
మరోవైపు ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా ప్రాంతంలో బిహార్‌కు చెందిన రాజా షా సహా మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో షా ప్రాణాలు కోల్పోయాడు. కాగా గత వారం రంజిత్ సింగ్ అనే టూరిస్ట్ గైడ్‌పై ముష్కరులు దాడి చేయగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈనెల 19న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com