Badrinath : బద్రీనాథ్ రూట్ బంద్

ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమ వుతోంది. ఇవాళ చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై పాతాల్ గంగా లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణాలను కొద్ది గంటల పాటు నిలిపేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలి చిపోయాయి. అధికారులు శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు. కొండచరియలు విరిగిపడుతు న్న వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అయింది. చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లా ల్లోని అనేక గ్రామాలు నీటితో నిండిపోయాయి. జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ వద్ద అలకనంద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉత్తరాఖం డ్ నదులు చాలా వరకు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంలో మరికొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com