Breaking : పరువు నష్టం కేసు.. రాహుల్‌కు బెయిల్

Breaking : పరువు నష్టం కేసు.. రాహుల్‌కు బెయిల్
X

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ( Rahul Gandhi ) బెయిల్ మంజూరైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని ఆయనపై ఆ పార్టీ నేతలు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టు తాజాగా రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. 2019-2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ప్రతీ పనిలోనూ 40% కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. రాహుల్‌ ఆరోపణలపై కర్ణాటక బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో224 సీట్లలో 135 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 66 సీట్లు సాధించగా, జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు గెలుచుకుంది.

Tags

Next Story