Bengal Governor : లైంగిక వేధింపుల ఆరోపణలపై బెంగాల్ గవర్నర్ సంచలన కామెంట్స్

పశ్చిమ బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అక్కడి రాజ్ భవన్ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. వేధింపుల అంశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 'రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ', 'ఆమె పోలీసుల'కు తప్ప 100 మందికి చూపిస్తామని ప్రకటనలో రాజ్ భవన్ పేర్కొంది.
రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే కావాలనుకునే వారు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా తమ అభ్యర్థనలు పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులకు మాత్రమే గురువారం ఉదయం రాజ్ భవన్ ఫుటేజీని చూడటానికి అనుమతి ఉంటుందని పేర్కొంది.
లైంగిక ఆరోపణల నేపథ్యంలో సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పంచుకోవాలని పోలీసులు రాజ్ భవన్ ను కోరారు. అయితే ఈ విషయంలో పోలీసులకు సహకరించవద్దని గవర్నర్ తన సిబ్బందిని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com