Bihar CM : బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను చంపుతా.. వ్యక్తి అరెస్ట్

Bihar CM : బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను చంపుతా.. వ్యక్తి అరెస్ట్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కాల్చి చంపుతామని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. పాట్నా పోలీస్ SDPO (లా అండ్ ఆర్డర్) కృష్ణ మురారి ప్రసాద్ అరెస్టును ధృవీకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని, మూడవ నిందితుడిని మార్చి 12న అరెస్టు చేశారు.

పాట్నా జిల్లాకు చెందిన విశేష్ చతుర్వేది అనే నిందితుడు ముంబైలో చదువుతున్నాడు. గత నెలలో ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన చతుర్వేది సీఎం కుమార్‌పై బెదిరింపులు, నీచమైన పదజాలం ఉపయోగించారు. యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి, ఫిబ్రవరి 14న పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఐటి చట్టం, ఐపీసీ సెక్షన్లు 353, 504, 505, 506 కింద అతనితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయగా మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా తాజాగా చతుర్వేదిని మంగళవారం NTPC బార్హ్ ప్రాంతంలోని అతని స్వగ్రామం నుండి అరెస్టు చేశారు. నిందితుడు నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story