Bill Gates : ఇండియాలో ఏఐకి మరిన్ని అవకాశాలు.. బిల్ గేట్స్ హిస్టారిక్ టూర్

Microsoft : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) ఇండియా టూర్ (India Tour) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) రంగానికి మరో టర్నింగ్ పాయింట్ గా చెప్పుకుంటున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. మోదీతో సమావేశం తర్వాత బిల్ గేట్స్ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ప్రధాని మోదీతో చర్చించిన పలు విషయాల గురించి వెల్లడించారు. ఈ మేరకు పోస్టు పెట్టిన బిల్ గేట్స్.. మోదీతో సమావేశం స్ఫూర్తివంతమని చెప్పారు.
AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవసాయంలో ఆవిష్కరణలు, ఆరోగ్యం, వాతావరణ అనుకూలత మరియు భారతదేశం నుండి ప్రపంచానికి పాఠాలు నేర్చుకోవడం వంటి ఇతర విషయాల గురించి ప్రధానితో మాట్లాడినట్లు గేట్స్ తెలిపారు. బిల్ గేట్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టిన తర్వాత.. ప్రధాని మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు. బిల్ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా సాగిందని వ్యాఖ్యానించారు. భూమి పరిరక్షణ, సామాన్యులకు సాధికారత వంటి అనేక అంశాలపై చర్చించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
బిల్ గేట్స్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, మన్‌సుఖ్ మాండవీతో పాటు ఇతరుతో కూడా సమావేశం అయ్యారు. ఈ మేరకు వారితో సమావేశాల గురించి కూడా బిల్ గేట్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. గత మంగళవారం రాత్రి బిల్‌గేట్స్ భారత్‌కు వచ్చారు. బుధవారం తొలుత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశారు. భువనేశ్వర్‌లోని మురికి వాడలను సందర్శించారు. కొన్ని మహిళా స్వయం సహాయక బృందాలతో కూడా గేట్స్ సమావేశమయ్యారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లలో కూడా గేట్స్ తో సహా ప్రపంచవ్యాప్త సోషల్ దిగ్గజాలు పాల్గొంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com