Akhilesh Yadav : రిజర్వేషన్లను బీజేపీ తొలగిస్తుందన్న అఖిలేష్

X
By - Manikanta |1 July 2024 12:13 PM IST
రిజర్వేషన్ల మూల సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav ) ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ కుటుంబాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, యూపీలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో ఈ కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జవహరల్ లాల్ నెహ్రూ యూనివ ర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సి టీల్లో బీసీలు, దళితులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని, ఈ వర్సిటీల్లో కుటుంబాలకు చెందిన వారికి 15 శాతం కంటే తక్కువగా ఉద్యోగాలు కేటాయించారని అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రిజర్వే షన్లకు సానుకూలంగా లేదని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com