BJP : పంజాబ్‌లో బీజేపీ సున్నా.. ఒడిశాలో గెలుపు

BJP : పంజాబ్‌లో బీజేపీ సున్నా.. ఒడిశాలో గెలుపు
X

పంజాబ్‌లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 13 స్థానాల్లో ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న AAP 3 స్థానాల్లో గెలుపొందింది. అత్యధికంగా కాంగ్రెస్ 7 చోట్ల జయకేతనాన్ని ఎగురువేసింది. స్వతంత్రులు 2, శిరోమణి అకాళీదల్ ఒక స్థానంలో గెలుపొందాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ జైలులో ఉండి పోటీ చేసిన అమృత్ పాల్(1,97,120)కి రావడం గమనార్హం.

మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేడీ కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో మొత్తం 147 స్థానాల్లో పోటీ చేసి 78 సీట్లు గెలుపొందింది. మరోవైపు బీజేడీ 51 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 14 సీట్లు, ఇతరులు నాలుగు సీట్లు గెలుపొందారు. మెజార్టీ మార్క్ 74 కంటే ఎక్కువ సీట్లే గెలవడంతో బీజేపీ త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బీజేపీ గెలుపుతో నవీన్ పట్నాయక్ 24ఏళ్ల పాలనకు తెరపడింది.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమికి 46.2% ఓట్ షేర్ నమోదు కాగా ఇండియా కూటమి ఓట్ షేర్ 41.3%గా రికార్డ్ అయింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి (అప్పట్లో UPA) ఓట్ షేర్ 6.99% వృద్ధి చెందింది. మరోవైపు NDA కూటమికి గతంలో పోలిస్తే 0.2% ఓట్ షేర్ తగ్గింది. ఇక ఇతరులకు 2019తో పోలిస్తే 6.79% పోల్ శాతం తగ్గి 12.5%గా రికార్డ్ అయింది.

Tags

Next Story