BJP High Command : నడ్డా పదవీకాలం జూన్ వరకు పొడిగింపు

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ బీజేపీ (BJP) హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2024 జూన్ వర కూ పొడిగించింది. 2020లో అమిత్ నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలను నడ్డా తీసుకున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడి గించాలనే ప్రతిపాదన గత జనవరిలో అమితా చేయగా, దీనికి బీజేపీ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
తాజా నిర్ణయంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం నడ్డాకు ఉంటుంది. అయితే, ఆ తర్వాత దానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. జేపీ నడ్డా అధ్యక్షుడిగా బీజేపీ పలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో పార్టీని ఆయన విజయ తీరాల కు చేర్చారు.
ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాల రెండోరోజైన ఆదివారం నాడు నడ్డా పదవీ కాలం పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో వేలాది మంది పార్టీ కార్య కర్తలు, అగ్రనేతలు పాల్గొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ప్రచార అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com