BJP : బీజేపీలోకి సమలత.. వివాదంలో కంగన

ప్రముఖ నటి, మాండ్యా ఇండిపెండెంట్ ఎంపీ సుమలత అంబరీష్ (Sumalatha) శుక్రవారం నాడు బీజేపీలో చేరారు.లోక్ సభ ఎన్నికల వేళ ఇది ఎన్డీయే కూటమికి కలిసొచ్చే పరిణామమే. ఈసారి ఎన్నికల్లో మాండ్యా సీటును ఎన్డీయే కూటమిలోని జేడీఎస్ కు కేటాయించారు. కాగా ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సుమలత ఇప్పుడు బీజేపీలో చేరడం విశేషం. కార్యకర్తలతో చర్చించిన తరువా త ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణ చుకున్నట్లు ఈ సందర్భంగా సుమలత వెల్లడించారు.
చరిత్రపై ఏమాత్రం పట్టులేకుండా తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీ అభ్యర్థి, బాలీ వుడ్ నటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యానించిన ఆమె, స్వాతంత్య్రం వచ్చాక ఆయనను భారత్లోకి రానివ్వకపోవడంలో వల్లే ఆయన కన్పించలేదని అనడంతో వివాదం రేగింది. ఆమెకు చరిత్రపై ఏ మాత్రం అవగాహన లేదని విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమంలో ఆమెపై ట్రోలింగ్ మామూ లుగా లేదు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com