BJP Leaders : వారణాసిలో మన బీజేపీ నేతల క్యూ.. మోడీ కోసం ప్రచారం
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం, సీనియర్ నేతలు అంతా వారణాసికి షిఫ్ట్ అయ్యారు. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ లక్ష్మణ్ వారణాసిలో మకాం వేసి ప్రధాని గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వారణాసిలో ప్రచారం నిర్వహించేందుకు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ కూడా సోమవారం నాడు వారణాసి బయల్దేరి వెళ్లారు.
రానున్న నాలుగు రోజుల పాటు వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోదీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్నారు. ప్రత్యేకించి వారణాసిలో ఉన్న తెలుగు ఓటర్లను బీజేపీ వైపుకు తిప్పుకునేలా రాష్ట్ర నేతల ప్రచారం కొనసాగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com