BJP Manifesto : రేపే బీజేపీ మేనిఫెస్టో.. మ్యాటర్ చాలా ఉంది

BJP Manifesto : రేపే బీజేపీ మేనిఫెస్టో.. మ్యాటర్ చాలా ఉంది

'సంకల్ప్ పత్ర' పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రేపు రిలీజ్ కానుంది. ఏప్రిల్ 14వ తేదీని డిసైడ్ చేసుకోవడం వెనుక పెద్ద కసరత్తే జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ జయంతి రోజునే మేనిఫెస్టో ప్రకటనకు ఎంచుకోవడం వెనుక పెద్ద మ్యాటర్ ఉందనేది ఇన్ సైడ్ టాక్.

బీజేపీ వస్తే రాజ్యాంగం మార్చేస్తుంది అన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. అందుకే.. అదే తేదీ ఎంచుకుని మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారా.. రాజ్యాంగం మార్చేలా ఏం ఉండబోతోంది.. అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అవుతోంది.

మిషన్ 400 సీట్లు టార్గెట్ గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 19 నుంచి తొలి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడుదలవుతున్న బీజేపీ మేనిఫెస్టో పొలిటికల్ సర్కిల్స్ ను ఆకర్షిస్తోంది. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మంది సభ్యులతో బీజేపీ మేనిఫెస్టో కమిటీ దీనిని రూపొందించింది. నమో యాప్ లో సూచనలు, ప్రత్యక్షంగా లక్షన్నర మందికి పైగా వీడియో మెసేజ్ లు.. ఇలా.. చాలామంది అభిప్రాయాల సేకరణతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story