Jammu & Kashmir : జమ్ముకశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

జమ్మూ కశ్మీర్ లో బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కన్నుమూశారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తమ్ముడైన దేవంద్రసింగ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్టో దేవేందర్ సింగ్ రాణా నగ్రోటా అసెంబ్లీ నియోజవర్గ నుంచి ప్రత్యర్థి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి జోగిందర్ సింగ్ పై గెలుపొందారు. జమ్మూలోని దోడా జిల్లాలో జన్మించిన రానా .. తన ఆటోమొబైల్ కంపెనీ, జమ్‌కాష్ వెహికిలేడ్స్‌ని స్థాపించడం ద్వారా వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. రాజకీయాల్లోకి అతని ప్రస్థానం నేషనల్ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ తో ప్రారంభమైంది. ఎన్సీలో ఉన్నప్పుడు ఒమర్ అబ్దుల్లాకు సన్నిహితంగా.. రాజకీయ సలహాదారుగా ఉండేవారు. రానా NCకి ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2021 అక్టోబర్ లో హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత రానా NCని విడిచిపెట్టి, సుర్జిత్ సింగ్ స్లాథియాతో కలిసి BJPలో చేరారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com