Hema Malini : హేమమాలిని ఆస్తి రూ.123 కోట్లు.. అప్పు రూ.1.4 కోట్లు

బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని (Hema malini) సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి యూపీలోని మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. తనకు సుమారు రూ.123 కోట్ల ఆస్తులు, రూ.1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అఫిడవిట్ ప్రకారం హేమమాలిని వద్ద రూ.13.5 లక్షలు, ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ వద్ద రూ.43 లక్షల నగదు ఉంది.
విలువైన కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. హేమమాలని అఫిడవిట్ ప్రకారం ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదు. హేమమాలిని 2012లో ఉదయపూర్‌లోని సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. నామినేషన్ ధాఖలు చేసేముందు హేమ మాలిని యమునా నది ఒడ్డున ఉన్న విశ్రమ్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు.
యమునా నదిని శుభ్రం చేయడానికి కృషి చేస్తానని ప్రజలకు ఈ సందర్భంగా ఆమె మాటిచ్చారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com