Menaka Gandhi : మేనకా గాంధీ ఆస్తులు ఎంతంటే?

Menaka Gandhi : మేనకా గాంధీ ఆస్తులు ఎంతంటే?
X

బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. యూపీలోని సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె తన ఆస్తుల విలువ రూ.97.17 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.51.20 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.45.97 కోట్ల చరాస్తులు ఉన్నాయి. తన వద్ద రూ.2.82 కోట్ల విలువైన 3.415 కిలోల బంగారు ఆభరణాలు, 85 కిలోల వెండితోపాటు రూ.40 వేల విలువైన రైఫిల్‌ ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు.

పోస్టాఫీసు పొదుపులు కూడా 2019లో రూ.43.32 లక్షలు ఉండగా, ఇప్పటివరకు అవి రూ.81.01 లక్షలకు పెరిగాయి. 2019లో ఆమె ఆస్తుల విలువ రూ.55.69 కోట్లు ఉండగా.. ఐదేళ్లలో 43శాతం పెరిగింది. ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన మేనకా గాంధీ .. తొమ్మిదోసారి ఎన్నికల బరిలో నిలిచారు.

Tags

Next Story