Kerala : కేరళలో టీచర్ కు ఎంపీ టికెట్

కేరళలోని (Kerala) కాసరగోడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ML అశ్విని(38) పోటీ చేయనున్నారు. టీచర్ ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన ఆమె దాదాపు 10 రాష్ట్రాల్లో మహిళా మోర్చా కార్యకలాపాల బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆమె మలయాళంతో పాటు కన్నడ, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్ భాషలు మాట్లాడగలరు. ఓటర్లతో ఆమె మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రతిభ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, అశ్వినినే బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.
ఎంఎల్ అశ్విని ఒక మామూలు స్కూల్ టీచర్. ఆమె గ్రామం మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే పార్టీ అధిష్ఠానం ఆమెకు పట్టం కట్టింది. కాసరగోడ్‌లో లోక్‌సభ బరిలో నిలిపింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్. కన్నడ మాతృ భాషగా బెంగళూరులో పుట్టి పెరిగిన అశ్విని కాసరగోడ్‌కు కోడలుగా వచ్చింది.
చిన్నప్పటినుంచే ఇంగ్లీష్, హిందీ మీద పట్టున్న ఆమెకు భాషలు నేర్చుకోవటం ఇష్టం. దీంతో చుట్టుపక్కల కుటుంబాల నుంచి తుళు నేర్చుకుంది. తరువాత తమిళం, మరి కొంతకాలం తరువాత మలయాళం మీద పట్టు పెంచుకుంది. కుటుంబసభ్యులతో ఒక్కొక్కరితో ఒక్కో భాష మాట్లాడి సాధన చేసే అశ్వినికి ఆమె భాషా పరిజ్ఞానం మేలే చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com