రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ  అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు 12 మందితో రాజ్యసభ అభ్యర్థుల జాబితాను రిలీజ్‌ చేసింది. గుజరాత్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్‌ను నలుగురు, ఒడిషా నుంచి ఒకరిని అభ్యర్థులుగా ఎంపిక చేసింది.

గుజరాత్‌ నుంచి జేపీ నడ్డా, గోవింద్‌భాయ్‌ డోలాకియా, మయాంక్‌భాయ్‌ నాయక్‌, శ్వంత్‌సిన్హ్ జలంసింహ పర్మార్‌లను ఎంపిక చేయగా.. మహారాష్ట్ర నుంచి అశోక్‌ చవాన్‌, మేధా కుల్‌కర్ణీ, అజిత్ గోప్‌చాడేలతోమ కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదేవిధంగా మధ్యప్రదేశ్‌ నుంచి డా. ఎల్‌. మురుగన్‌, ఉమేష్‌నాథ్‌ మహారాజ్‌, బన్సిలాల్‌ గుర్‌జార్‌, మాయా నరోలియాలను ఎంపిక చేశారు.

ఓడిశా నుంచి అశ్వీణీ వైష్ణవ్‌కు మరోసారి బీజేపీ అవకాశం కల్పించింది. ఇక..మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్ చౌహన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం గమనార్హం.

గత ఆదివారం రాజ్యసభకు 14 మంది అభ్యర్థులతో భాజపా మొదటి విడత జాబితా విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ (7), బిహార్‌ (2), ఛత్తీస్‌గఢ్‌ (1), హరియాణా (1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్‌ (1), పశ్చిమబెంగాల్‌ (1) రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలు ఇందులో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story