BJP : గుజరాత్ లో బీజేపీ బోణీ.. ఎంపీ ఎన్నిక ఏకగ్రీవం

కాంగ్రెస్ అభ్యర్థి చేసిన పొరపాటు.. మోడీ చర్మిషాకు మరింత వన్నెలద్దింది. గుజరాత్ ఓ ఎంపీ ఎన్నికల ఏకగ్రీవం అయింది. సూరత్ లోక్‌సభ ఎన్నిక ఏకగ్రీవమయింది. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
గుజరాత్ లోని సూరత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి సర్టిఫికెట్ ను ఆయనకు ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ చెల్లకపోవడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమయింది.
1952 తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సూరత్ నియోజకవర్గంలో ఓ ఎంపీ అభ్యర్ధి ఎన్నిక ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. నిజానికి వచ్చే నెల 7వ తేదీన సూరత్ లో ఎంపీ పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతుంది. కోర్టుకు వెళ్తామంటోంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభని దాఖలు చేసిన నామినేషన్ పై ప్రతిపాదించిన సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటంతో తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి చెబుతున్నారు. ప్రపోజ్ చేసిన వారు కూడా నామినేషన్ కు అటెండ్ కాలేదన్నారు. మిగిలిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, బీఎస్పీ క్యాండిడేట్, మరో ముగ్గురు స్థానిక పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో.. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ను ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ప్రకటించడం సంచలనం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com