BJP Twist : మమతతో టచ్‌లోకి ముగ్గురు ఎంపీలు

BJP Twist : మమతతో టచ్‌లోకి ముగ్గురు ఎంపీలు
X

పశ్చిమ బెంగాల్ లో సంచలనం నమోదయ్యేలా ఉంది. సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ మోడీకి షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని తెలిపింది. అయితే టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

ఇది తప్పుడు ప్రచారమని బీజేపీ విమర్శించింది. బెంగాల్ లో లోక్ సబ ఎన్నికల పోలింగ్ ఏడు దశల్లో జరిగింది. ఈసారి మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టీఎంసీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.

లోక్ సభ ఎన్నికల ఫలితాలతో.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని తేలింది. 2019లో టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా ఈసారి 29 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోగా ఈసారి 12 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

Tags

Next Story