AP : కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ బతకనివ్వదు : కూనంనేని

బీజేపీ (BJP) కాంగ్రెస్ ప్రభుత్వాలను (Congress Government) బతకనివ్వదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అరెస్టును ఖండిస్తున్నామ ని చెప్పారు. కేజీవాల్ ను బాగా బెదిరింపులకు, వేధింపులకు గురి చేశారని, లొంగక పోవడం తోనే అరెస్టు చేశారని కూసం నేని ఆరోపించారు.
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తోందని, రాజ్యంగ సంస్థలను అడ్డుపెట్టుకొ ని ఇప్పటికే ఇద్దరు సీఎంలను అరెస్టు చేసిందని అన్నారు. ఏదో ఒక కేసులో ఇరికించి రేపు సీఎం రేవంత్ రెడ్డిని కూడా జైల్లో వేస్తారేమోన ని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ తీసుకొచ్చి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని బీజేపీ చూస్తోందని, 400 సీట్లు గెలిస్తే బీజేపీ ఆగడాలు మితిమీరిపోతాయని అన్నారు.
బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విప లమవుతోందని అన్నారు. కాంగ్రెస్ అన్ని రాష్ట్రా ల్లోని ఇండియా కూటమి పార్టీలను కలుపుకొని పోవాలన్నారు. తమకు రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటైనా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. వామపక్షాలతో కలిసి వెళితేనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించ గలిగామని, ఇప్పుడు కూడా కలిసి వెళ్తామని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com