Bomb Scare : రామ్‌లాల్ ఆనంద్ కళాశాలకు బాంబు బెదిరింపు

Delhi : ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్‌లాల్ ఆనంద్ కళాశాల సిబ్బందికి ఉదయం బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనకు గురయ్యారు. వాట్సాప్‌లో ఉదయం 9:34 గంటలకు మెసేజ్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నైరుతి) రోహిత్ మీనా తెలిపారు.
వెంటనే స్పందించిన పోలీసులు, అంబులెన్స్‌తో పాటు, బాంబ్ డిటెక్షన్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, విద్యార్థులు, సిబ్బందిని కళాశాల ప్రాంగణం నుండి ఖాళీ చేయించారు. "సెర్చింగ్ అండ్ చెకింగ్ లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు, అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు" అని ఓ అధికారి చెప్పారు.
ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్
ఫిబ్రవరి 27న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయానికి ఒక అజ్ఞాత కాలర్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విచారణలో, బెదిరింపు బూటకమని తేలిందని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ కాల్ బోగస్ అని తేలిందని ఓ అధికారి తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సేఫ్టీ ప్రోటోకాల్‌లను అనుసరించినట్లు వారు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com