Amit Shah : అమిత్ షా మీటింగ్ లో ఉండగా.. కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపు

Amit Shah : అమిత్ షా మీటింగ్ లో ఉండగా.. కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపు
X

దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర సంచలనంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇవి ఫేక్ కాల్స్ అని ధ్రువీకరించుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు.

పాఠశాలలు, ఆస్పత్రులు, ఎయిర్పోర్టులు సహా కీలక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా కేంద్ర హోంశాఖకే బాంబు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ బాంబు హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు, అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న కేంద్ర హోం శాఖ కార్యాలయానికి బుధవారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. నార్త్ బ్లాక్ వద్ద బాంబు ఉందని.. పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఈ-మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి ఏమీ లేదని తేల్చారు.

Tags

Next Story