బ్రేకింగ్.. అరవింద్ కేజీవాల్ కు కోర్టు సమన్లు

X
By - Manikanta |7 March 2024 11:24 AM IST
Delhi : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రివాల్ కు (Arvind Kejriwal) కోర్టు సమన్లు పంపింది. మార్చి 16న ఆయన విచారణకు హాజరు కావాలని ఢిల్లీలోని అవెన్యూ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఆయనకు పలుమార్లు సమన్లు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకావడంలేదని ఈడీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించింది. మరి కోర్టు సమన్లపై కేజ్రివాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా ఇదే కేసులో ఇప్పటికే అరవింద్ కేజ్రివాల్ ను సీబీఐ విచారించింది. 2023 ఏప్రిల్ లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించింది. ఇదే కేసులో ఆప్ లీడర్లు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com