Big Shock : తెలుగు మహిళ శ్రీకళారెడ్డికి బీఎస్పీ బిగ్ షాక్

Big Shock : తెలుగు మహిళ శ్రీకళారెడ్డికి బీఎస్పీ బిగ్ షాక్
X

యూపీలోని జౌన్‌పూర్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి, తెలుగు మహిళ శ్రీ కళారెడ్డికి ఆ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆఖరి నిమిషంలో ఆమె అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్యామ్ సింగ్ యాదవ్‌నే బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. నాలుగు రోజుల క్రితమే శ్రీ కళారెడ్డి నామినేషన్ కూడా వేశారు. కానీ ఆమెకు మాయావతి బీఫామ్ ఇవ్వలేదు. జౌన్‌పూర్‌లో మే 25న ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలోని ఓ రాజకీయ వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వారే ఈ శ్రీకళారెడ్డి. ఆమె తండ్రి జితేంద్ర రెడ్డి.. నల్గొండ జిల్లా కోఆపరేటివ్ అధ్యక్షుడిగా, హుజూర్‌ నగర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పనిచేశారు. ఆమె తల్లి లలిత కూడా తమ సొంతూర్లో గ్రామ సర్పంచ్‌ గా పనిచేశారు. నిప్పో గ్రూపు పేరుతో బ్యాటరీలు సహా వివిధ అనుబంధ వస్తువులు తయారు చేసే వ్యాపారం వీరిది

ఈ క్రమంలో... యూపీలో గ్యాంగ్‌ స్టర్, రాజకీయవేత్త ధనుంజయ్ సింగ్‌ ను పెళ్లాడిన శ్రీకళారెడ్డి, అత్తింటికి మకాం మార్చారు. ధనుంజయ్ సింగ్ యూపీలోని జౌన్‌ పూర్ కేంద్రంగా రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. అందుకే తన సతీమణి శ్రీకళరెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి గెలుపించుకున్నారు.. అనంతరం జౌన్‌ పూల్ జిల్లా పరిషత్ ఛైర్‌ పర్సన్‌ గా చేయగలిగారు.

Tags

Next Story