Mumbai : ముంబైలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు

Mumbai : ముంబైలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు
X

మహారాష్ట్రలోని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన బెస్ట్ బస్సు పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మరో 25మందికి గాయాలు అయ్యాయి. సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి వెళ్తుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు పక్కన ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు ఢీకొట్టడం వల్ల అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. బస్సును అతివేగంతో నడిపినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు దెబ్బతిన్న వాహనాలను తొలిగించే పనులు చేపట్టారు.

Tags

Next Story