Exit Polls : ఇండియా కూటమికి 295 సీట్లు సాధ్యమేనా?

ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే మళ్లీ అధికారమని అంచనా వేస్తున్నా ఇండియా కూటమి మాత్రం తాము 295 సీట్లు సాధిస్తామని ధీమాగా ఉంది. అయితే కూటమికి అంతమొత్తంలో సీట్లు రావడం సవాల్‌తో కూడుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘దక్షిణాది రాష్ట్రాలు, యూపీ, బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, లక్షద్వీప్, అండమాన్, జమ్మూకశ్మీర్ నుంచి 295 స్థానాల్లో 176 గెలిచినా మిగతా రాష్ట్రాల్లో 119 సీట్లు గెలవాలి’ అని పేర్కొన్నారు.
రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా మొదలైన రాష్ట్రాలు ఈ రెండో జాబితాలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఆ 119 స్థానాలు గెలవడం సవాల్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ 2019 లెక్కలను మార్చగలిగితే ఇప్పుడు ఆశిస్తున్న టార్గెట్‌ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు.
హ్యాట్రిక్‌పై బీజేపీ ధీమా వెనుక ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ‘మోదీ ఇమేజ్ కీలక పాత్ర పోషించింది. కార్యకర్తలు, RSS అండ ఆ పార్టీకి బలంగా మారింది. ఆర్థికంగా బలంగా ఉండటమూ పార్టీకి కలిసొచ్చింది. మహిళలు, యువత, రైతులు, పేదలే లక్ష్యంగా ప్రచారం చేసి ఓటర్ బేస్ పెంచుకునే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికల్లో ఓట్ షేర్ 45%కు పెరగడంతో ఈసారి కూడా ఆ ప్రభావం ఉండొచ్చని ధీమాగా ఉంది’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com