Amit Shah : ఎన్నికల కోడ్ ఉల్లంఘన .. అమిత్ షాపై కేసు నమోదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో హైదరాబాద్ లోని మొఘల్‌పురా పీఎస్‌లో సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదుతో CEC చర్యలు తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్ ప
సీపీని ఆదేశించింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఆయన చిన్నారులతో ప్రచారం చేయించారని నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొఘల్ పురా పోలీసులు విచారణ చేసి క్రైం నెంబర్ 77/2024 . సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా యమాన్ సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, A3 గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. A4గా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి A5గా MLA రాజసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com